M4 న్యూస్, ఆదిలాబాద్, అక్టోబర్ 23
ఆదిలాబాద్ జిల్లాలో గౌడజన హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో జిల్లా ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. సమావేశానికి జిల్లా అధ్యక్షులు అక్కల గారి శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షత వహించగా, జాతీయ అధ్యక్షులు, తెలంగాణ గౌడ సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ అమరవేణి నర్సాగౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
సభలో గౌడ కులస్తులకు తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అమరవేణి నర్సాగౌడ్ అన్నారు. కల్లు గీత కార్మికులకు గీత కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి, దానికి రూ. 5,000 కోట్ల నిధులు కేటాయించాల్సిన అవసరం ఉందని, ఈ వృత్తిని పరిశ్రమగా గుర్తించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
కల్లు గీత కార్మికుల ప్రమాద భీమాను రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచాలని, ఏజెన్సీ గీత కార్మికులను St గా గుర్తించి వారికి లైసెన్స్‌లు రెన్యూవల్ చేయాలని డిమాండ్ చేశారు.
సమావేశంలో పాల్గొన్న నాయకులు కొన్ని సమస్యలపై దృష్టి సారించి, జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్క గారి దృష్టికి తీసుకువెళ్లేందుకు నిర్ణయించారు.