జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్లో గౌతపురం జట్టు విజయం

జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్లో గౌతపురం జట్టు విజయం

ఎమ్4 న్యూస్ (ప్రతినిధి)
రంగారెడ్డి జిల్లా: అక్టోబర్ 07

షాద్ నగర్ పట్టణంలోని స్టేడియంలో జరుగుతున్న జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్లో గౌతపురం జట్టు విజయం సాధించింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో, గౌతపురం జట్టు చౌదరిగూడ జట్టుతో తలపడింది.

తొలుత బ్యాటింగ్ చేసిన గౌతపురం జట్టు 8 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 59 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌కు దిగిన చౌదరిగూడ జట్టు 8 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 50 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ నేపథ్యంలో, 9 రన్ల తేడాతో గౌతపురం జట్టు విజయం సాధించింది.

గౌతపురం జట్టు విజయానికి కీలకమైన కృషి చేసిన కెప్టెన్ సతీష్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ కార్యక్రమంలో గానీ పికెపి, శ్రీధర్, క్రికెట్ టోర్నమెంట్ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment