గంగపుత్రులు అన్ని రంగాల్లో ఎదగాలి
సాంప్రదాయమైన మత్స్యకార వృత్తిని కొనసాగిస్తున్న గంగపుత్రులు అన్ని రంగాల్లో ఎదగాలని గంగపుత్ర యువ తరంగణి జిల్లా అధ్యక్షులు మోహన్ అన్నారు, బుధవారం బైంసా మండలంలోని కోతలుగా, ఎగ్జామ్, బిజ్జూర్, గ్రామాల్లో నిర్వహించిన చైతన్య సదస్సులో ఆయన మాట్లాడారు, అనాదిగా గంగపుత్రులు వెనుకబడుతున్నారని ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి గంగపుత్రుడికి అందే విధంగా పాలకులు చొరవ చూపాలని కోరారు, మత్యకారుల సమస్యల పరిష్కారానికి యువత నడుం బిగించాలని తెలిపారు, ఈ కార్యక్రమంలో గంగపుత్ర యువ తరంగిణి జిల్లా నాయకులు, పొట్టోల్లా రాజేశ్వర్, దొంతుల వార్ పవన్, శివరాత్రి దత్తాద్రి, ఎగ్గం గంగపుత్ర సంఘం అధ్యక్షులు గంగాధర్, రవి, కోతులుగా సంఘం అధ్యక్షులు సత్యనారాయణ మత్స్యకారులు పాల్గొన్నారు