కుంటాల మండలంలో గణనాథుడి నిమజ్జనం శోభాయాత్ర
మనోరంజని ప్రతినిధి, కుంటాల | సెప్టెంబర్ 4
నిర్మల్ జిల్లా కుంటాల మండలం పెంచికల్ పాడ్ గ్రామంలో మరాఠా సంఘం ఆధ్వర్యంలో ప్రతిష్టించిన గణనాథుడికి తొమ్మిది రోజుల పాటు గ్రామ ప్రజలు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు.
గురువారం నిమజ్జనం సందర్భంగా ఊరేగింపు శోభాయాత్ర భజన, కీర్తనల మధ్య అంగరంగ వైభవంగా కొనసాగి, ప్రశాంత వాతావరణంలో గణనాథుడిని నిమజ్జనం చేశారు.
ఈ సందర్భంగా నిర్వహించిన గణపతి లడ్డు వేలంపాటలో షేక్ మహబూబ్ గారు రూ.1100కి లడ్డు దక్కించుకున్నారు.
ఆయనకు, వారి కుటుంబానికి వినాయకుడి ఆశీస్సులు ఉండాలని నిర్వాహకులు ఆకాంక్షించారు.