రేపటి నుంచి గణపతి నవరాత్రోత్సవాలు!

రేపటి నుంచి గణపతి నవరాత్రోత్సవాలు!

రేపటి నుంచి గణపతి నవరాత్రోత్సవాలు!

మనోరంజని  ప్రతినిధి

హైదరాబాద్:ఆగస్టు 26
తెలంగాణ రాష్ట్రంలో వినాయక చవితి సంబరాలకు సన్నద్ధమవు తుంది, వినాయక చవితి వచ్చిందంటే చాలు ఊరు వాడంత సంబరాలే, తొమ్మిది రోజులపాటు గణేష్ మండపంలో ఊరు వాడ లో గణపతి బప్పా మోరియా అనే నినాదాల తో మారుమోగుతాయి,

వినాయక చవితిని పురస్క రించుకుని బుధవారం నుంచి సెప్టెంబర్ 5వ తేదీ వరకు గణపతి నవరాత్రోత్స వాలు ఘనంగా నిర్వహిస్తా రు. హిందువులు జరుపుకునే పండగలలో వినాయక చవితి పండగకు విశిష్ట స్థానం ఉంది. పిల్లలు ఎంతో ఇష్టంగా జరుపుకునే పండగ. పెద్దలు పిల్లలుగా మారే పండగ. దేశ వ్యాప్తంగా వినాయక చవితి సందడి మొదలైంది. వినాయక పుట్టిన రోజైన బాద్రపద మాసం శుక్ల పక్షం చవితితిథి నుంచి 9 రోజుల పాటు గణపతిని పుజిస్తారు. ఇప్పటికే గల్లీ గల్లీలో గణపతి నవరాత్రి వేడుకల కోసం మండపా లను రెడీ చేస్తున్నారు.

తెలంగాణ లో గణపతి వినాయక చవితి పండగ అంటే ఆబాల గోపాలం కోలాహాలంగా జరుపుకోవ డానికి రెడీ అవుతారు. ఇప్పటికే ఈ పండగ సందడి మొదలైంది. గల్లీ గల్లీ లో గణపతి మండపాలు వెలిశాయి . చవితికి వారం రోజులున్నా బొజ్జ గణప య్య భక్తుల హడావిడి మొదలైంది.

అయితే బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేసే గణపతి మండపాలకు పోలీసులు అనుమతి తీసుకోవాల్సి ఉంది. ఈ నేపధ్యంలో తెలంగాణ పోలీసు శాఖ మండపాల ఏర్పాటు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. వినాయక చవితి మండపాల అనుమతులపై ఎటువంటి వివాదాలు లేకుండా.. ఎటువంటి సమస్యలు తలెత్తకుండా.. ఉండేలా తెలంగాణ పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. మండపాలు నిర్వహించే నిర్వాహకులు సీసీ కెమెరా లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు

Join WhatsApp

Join Now

Leave a Comment