గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆటల పోటీలు ప్రారంభం

గణతంత్ర దినోత్సవ ఆటల పోటీలు - సిద్దుల కుంట పాఠశాల
  • సోన్ మండలం సిద్దుల కుంట పాఠశాలలో ఆటల పోటీలు
  • ఉప ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర రావు ప్రారంభోత్సవం
  • కబడ్డీ, కోకో, క్రికెట్ తదితర ఆటలు
  • విద్యార్థుల శరీర ధారుఢ్యానికి ఆటలు కీలకం

 గణతంత్ర దినోత్సవ ఆటల పోటీలు - సిద్దుల కుంట పాఠశాల

సోన్ మండలంలోని సిద్దుల కుంట గ్రామ ఉన్నత పాఠశాలలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆటల పోటీలు ప్రారంభమయ్యాయి. ఉప ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర రావు పోటీలను ప్రారంభించి, కబడ్డీ, కోకో, క్రికెట్, బాలికలకు ముగ్గులు, తాడాట వంటి కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. విద్యార్థుల శారీరక మరియు మానసిక ఆరోగ్యానికి ఆటలు అవసరమని ఉపాధ్యాయులు సూచించారు.

 గణతంత్ర దినోత్సవ ఆటల పోటీలు - సిద్దుల కుంట పాఠశాల

గణతంత్ర దినోత్సవాన్ని సందర్బంగా నిర్మల్ జిల్లా  సోన్ మండలం సిద్దుల కుంట గ్రామంలోని ఉన్నత పాఠశాలలో ఆటల పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉప ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర రావు పోటీలను ప్రారంభించారు. కబడ్డీ, కోకో, క్రికెట్ వంటి ఆటలతో పాటు బాలికల కోసం ప్రత్యేకంగా ముగ్గుల పోటీలు, తాడాట వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఉపాధ్యాయుల సూచనలు:
విద్యార్థుల శారీరక ధారుఢ్యానికి ఆటలు ఎంతో అవసరమని, ఇవి వారి మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయని ఉపాధ్యాయులు కడారి దశరథ్, భూమా రెడ్డి, తగల పెల్లి నరేందర్, ముర్తుజాఖాన్ చెప్పారు. విద్యార్థులు ఈ పోటీల్లో చురుకుగా పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment