ప్రజా కవి గద్దర్ అవార్డు గ్రహీతగా గాలిపెల్లి కుమార్.

ప్రజా కవి గద్దర్ అవార్డు గ్రహీతగా గాలిపెల్లి కుమార్.

ప్రజా కవి గద్దర్ అవార్డు గ్రహీతగా గాలిపెల్లి కుమార్.

– గద్దరన్న అవార్డు తో గాలిపేల్లి కుమార్ ని సత్కారించిన అమ్మ ఫౌండేషన్ సభ్యులు

మనోరంజని కరీంనగర్ ( రూరల్ ) ఫిబ్రవరి 01

ప్రజా యుద్ధ నౌక, సామాజిక ఉద్యమకారుడు స్వర్గీయ గద్దర్ జయంతిని పురస్కరించుకుని అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వారి ఆధ్వర్యంలో గణేష్ కళాబృందం వారు పలువురు కవులను, కళాకారులను,సమాజ సేవకులు సమాజానికి వారు చేస్తున్న సేవలకు గద్దర్ అవార్డు పురస్కారాన్ని అందించడం జరిగింది. ఈ నేపథ్యంలో కరీంనగర్ జిల్లా, బొమ్మకల్ గ్రామ నివాసి సామాజిక సేవకుడు, ఎంతోమందికి అత్యవసరములలో రక్తాన్ని అందించి ఉత్తమ రక్త ప్రదాతగా మన్నలను పొందిన గాలిపెల్లి కుమార్ గారి సేవలను గుర్తించి గద్దర్ జయంతి సందర్భంగా గద్దర్ పురస్కార అవార్డును అందించి శాలువాతో సత్కరించి గద్దర్ పురస్కారాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా గద్దర్ అవార్డు గ్రహీత గాలిపల్లి కుమార్ మాట్లాడుతూ ప్రజా యుద్ధ నౌకగా, ప్రజా గొంతుకగా ఎన్నో పోరాటాలు చేసి అలుపెరగని విప్లవకారుడుగా తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న గద్దర్ గారి అవార్డు తీసుకోవడం చాలా గర్వంగా ఉందని, సమాజానికి చేస్తున్న సేవలను గుర్తించి అవార్డు కొరకు ఎంపిక చేసిన అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డి పల్లె కార్యవర్గ సభ్యులకు మరియు గణేష్ కళాబృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అందుకునే ప్రతి అవార్డు ఒక కొత్త ఉత్సాహాన్నిస్తూ చేస్తున్న సేవలను పెంపొందించే దిశగా బాధ్యతలు పెంచుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాకారులు, కవులు, సమాజ సేవకులు, గద్దర్ అభిమానులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment