జామ్ గ్రామ అభివృద్ధే లక్ష్యం : సర్పంచ్ అభ్యర్థి గడ్డల సుజాత రాజు

జామ్ గ్రామ అభివృద్ధే లక్ష్యం : సర్పంచ్ అభ్యర్థి గడ్డల సుజాత రాజు

మనోరంజని తెలుగు టైమ్స్ – సారంగాపూర్, డిసెంబర్ 08

నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని జామ్ గ్రామ అభ్యర్థి గడ్డల సుజాత రాజు గ్రామ అభివృద్ధినే తన ప్రధాన లక్ష్యంగా ప్రకటించారు. గ్రామ ప్రజల సమస్యలను అర్థం చేసుకుని, సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేస్తానని ఆయన తెలిపారు. గ్రామంలోని విద్య, వైద్య రంగాల పురోభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తానని పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి అందేలా కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి, వారి సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తానని సుజాత రాజు స్పష్టం చేశారు. జామ్ గ్రామ అభివృద్ధి కోసం ప్రజలు తనకు మద్దతు ఇవ్వాలని కోరిన ఆయన, రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బ్యాట్ గుర్తుకు ఓటు వేసి తాను గెలవడానికి సహకరించాలని గ్రామ పెద్దలు, మహిళలు, యువతను అభ్యర్థించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment