అక్టోబర్ నెల నుంచే పెళ్లి పండుగల హంగామా

అక్టోబర్ పెళ్లిళ్లు

హైదరాబాద్: అక్టోబర్ 07

ఈ నెల నుంచి వివాహాలు, గృహప్రవేశాలు, ఇతర శుభకార్యాలకు అనువైన ముహూర్తాలు ప్రారంభమవుతున్నట్లు పురోహితులు చెబుతున్నారు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మూడు నెలల్లో శుభ ముహూర్తాలు ఎక్కువగా ఉండటంతో పెద్ద సంఖ్యలో వివాహాలు జరగనున్నట్లు అంచనా వేస్తున్నారు.

ముహూర్తాల తేదీలు: అక్టోబర్ 12, 13, 16, 20, 27; నవంబర్ 3, 7, 8, 9, 10, 13, 14, 16, 17; డిసెంబర్ 5, 6, 7, 8, 11, 12, 14, 15, 26.

ఫంక్షన్ హాళ్లు, బ్యాంకెట్ హాళ్లలో అడ్వాన్స్ బుకింగ్‌లు పెరిగినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. అర్చక సంఘం కన్వీనర్ శ్రీరంగం గోపీ కృష్ణమాచార్యులు కూడా ఈ నెలను శుభకార్యాలకు అనుకూలమని ప్రకటించడంతో, బుకింగ్‌లు భారీగా పెరిగాయి.

దీంతో పాటు మాండపాల అలంకరణ, కేటరింగ్ సేవలకు డిమాండ్ కూడా పెరిగింది. వస్త్ర, బంగారం దుకాణాల్లో అమ్మకాలు పెరుగుతుండగా, బంగారం ధరలు పెరిగినప్పటికీ నగల ఆర్డర్లు అధికంగా వస్తున్నాయి. ఈ దసరా పండుగతో కలిపి సమస్త మార్కెట్ సందడిగా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment