రాంటెక్‌లో ఉచిత పశుగర్భకోశ చికిత్స-అవగాహన శిబిరం

రాంటెక్‌లో ఉచిత పశుగర్భకోశ చికిత్స-అవగాహన శిబిరం
  1. రాంటెక్ గ్రామంలో పశుసంవర్థక శాఖ శిబిరం.
  2. కృత్రిమ గర్భదారణ వల్ల పశువులకు మెరుగైన లాభాలు.
  3. మేలు జాతి దూడల ద్వారా పాల ఉత్పత్తి పెరుగుదల.
  4. పశువుల సంక్షేమంపై ప్రజలకు అవగాహన.

ముధోల్ మండలం రాంటెక్ గ్రామంలో పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో ఉచిత పశుగర్భకోశ చికిత్స-అవగాహన శిబిరం నిర్వహించారు. అధికారి రామారావు కృత్రిమ గర్భదారణ వల్ల పశువులకు లభించే ప్రయోజనాలు వివరించారు. మెరుగైన వీర్యదానం ద్వారా పాలు ఉత్పత్తి పెరిగి రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని తెలియజేశారు. గ్రామస్థులు శిబిరంలో చురుకుగా పాల్గొన్నారు.

ముధోల్, డిసెంబర్ 9:
రాంటెక్ గ్రామంలో సోమవారం పశుసంవర్థక శాఖ-పశుగణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉచిత పశుగర్భకోశ చికిత్స-అవగాహన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధికారి రామారావు పశువుల సంక్షేమం, కృత్రిమ గర్భదారణ వల్ల కలిగే ప్రయోజనాలు, మెరుగైన జాతి దూడల పుట్టుక గురించి వివరించారు.

ఆధునిక పద్ధతుల్లో దేశవాళీ పశువులకు మేలురకం వీర్యదానం ద్వారా పాల దిగుబడి పెరుగుతుందని, ఇది రైతుల ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో డా. సురేష్, డా. రవీందర్, డా. సౌదర్య, గోపాల మిత్ర, విజయ డైరీ మేనేజర్ వెంకటసామి, గ్రామస్థులు లావణ్య, సంజీవ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment