బాలలకు ఉచిత వైద్య సేవలు — డాక్టర్ దీపా జాదవ్
భైంసా, నవంబర్ 13 (మనోరంజని తెలుగు టైమ్స్ ప్రతినిధి):
బాలల దినోత్సవం నవంబర్ 14ను పురస్కరించుకొని, నిర్మల్ జిల్లా భైంసా పట్టణ కేంద్రంలోని కృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో బాలలకు ఉచిత వైద్య సేవలు అందించనున్నట్లు హాస్పిటల్ ప్రొప్రైటర్ డాక్టర్ దీపా జాదవ్ తెలిపారు. జిడిఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ అనిల్ కుమార్ జాదవ్ పిల్లలకు వైద్య సేవలు అందించనున్నారు. పిల్లల తల్లిదండ్రులు మధ్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం 4 గంటల వరకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె సూచించారు. వైద్య సేవలు అవసరమైన వారు నేరుగా ఆసుపత్రిని సంప్రదించవచ్చు.
ఇతర వివరాల కోసం 94413 33315 నంబర్‌ను సంప్రదించాలని డాక్టర్ దీపా జాదవ్ కోరారు