ఉచిత వైద్య శిబిరం – కీసర జిన్నారం కాలనీలో సేవా కార్యక్రమం
మనోరంజని తెలుగు టైమ్స్ – కీసర ప్రతినిధి, నవంబర్ 09
కీసర మండలంలోని జిన్నారం కాలనీలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించబడింది. ఈ శిబిరాన్ని ఈసీఐఎల్, పీపుల్స్ వెల్ఫేర్ ట్రస్ట్, కుషాయిగూడ నవోదయ సంక్షేమ వేదిక సంయుక్తంగా సీఐటియు కీసర మండల కమిటీ సహకారంతో నిర్వహించింది. శిబిరాన్ని శ్రీదేవి ప్రారంభించారు.
ఈ సందర్భంగా శ్రీదేవి మాట్లాడుతూ, ఇలాంటి వైద్య శిబిరాలు పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడతాయని, భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.
ట్రస్ట్ చైర్మన్ చనమోలు వరప్రసాద్ మాట్లాడుతూ, పేదలకు ఉచిత కంటి ఆపరేషన్లు రెగ్యులర్‌గా నిర్వహిస్తూ, స్పెక్ట్స్ కూడా అందజేస్తున్నామని అన్నారు. సీఐటియు కార్యదర్శి నర్సింగరావు మాట్లాడుతూ, కార్మికుల కాలనీల్లో త్వరలోనే క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపులు కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు.
కాంప్‌లో కమలానగర్ ప్లానెట్ ఆప్టికల్స్ డాక్టర్లు కళ్ల పరీక్షలు, దమ్మాయిగూడ పద్మసాయి డెంటల్ క్లినిక్ నుండి డాక్టర్ దినేష్ బృందం దంతపరీక్షలు, పి.డబ్ల్యూ.టి. తరఫున డాక్టర్ దేవిక జనరల్ పరీక్షలు నిర్వహించారు.
ఈ శిబిరంలో 227 మంది పాల్గొని అన్ని పరీక్షలు చేయించుకున్నారు. వారిలో 17 మందికి కాటరాక్ట్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఉచిత మందులు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో కాంప్ కన్వీనర్ సునీల్ కుమార్, ట్రస్ట్ నాయకులు జివి రావు, అలాగే కాలనీ వెల్ఫేర్ నాయకులు సుదర్శన్, మంగ్ల నాయక్, బానోత్ లక్ష్మణ్, పద్మయ్య, చంద్రయ్య, చారి, సరోజ, ముత్యాలు, చంద్రకళ, పల్లవి, సుల్తానా, కళ తదితరులు పాల్గొన్నారు.