ఉచిత వైద్య శిబిరం అభినందనీయం

ఉచిత వైద్య శిబిరం అభినందనీయం

ఉచిత వైద్య శిబిరం అభినందనీయం

మనోరంజని ప్రతినిధి భైంసా జులై06

అరుష్ చిల్డ్రన్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నవజాతి శిశువుల, చిన్న పిల్లలకు భైంసా మండలం వాలేగాంలోని గ్రామపంచాయతీ వద్ద ఉచిత వైద్యం శిబిరాన్ని ఆదివారం నిర్వహించారు. మాజీ ఎంపిటిసి మాణిక్ రావు పటేల్, మాజీ సర్పంచ్ శ్యామ్ రావు పటేల్, విడిసి అధ్యక్షులు రాందాస్, దిగంబర్ పటేల్,కిషోర్ పటేల్,కంమ్లె అశోక్, మారుతీ పటేల్ శిబిరాన్ని ప్రారంభించారు. నవజాతి శిశువుల, చిన్న పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ నరేష్ బిందెల, హాస్పెటల్ సిబ్బంది చిన్న పిల్లలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ఉచిత మందులు అందజేశారు. నిరుపేదల ఆరోగ్య పరీక్షకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని మాజీ ఎంపిటిసి మాణిక్ రావు పటేల్ అన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment