ఉచిత గ్యాస్ సిలిండర్.. రేపటితో గడువు ముగింపు
ఆంధ్రప్రదేశ్ : దీపం-2 పథకం కింద రెండో విడతలో ఉచిత గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునే అవకాశానికి గురువారంతో గడువు ముగియనుంది. గడువు దాటిన తర్వాత సిలిండర్ బుక్ చేసుకునే అవకాశం ఉండదు. 3వ విడత ఉచిత గ్యాస్ సిలిండర్‌ను ఆగస్టు 1 నుంచి నవంబర్ 30వ తేదీలోపు బుక్ చేసుకోవాలి. గ్యాస్ బుక్ చేసుకున్న 48 గంటల్లో ప్రభుత్వం లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో రాయితీ డబ్బును జమ చేస్తోంది