ఏపీలో మహిళలకు ఫ్రీ బస్సు పథకం

Alt Name: ఏపీలో మహిళలకు ఉచిత బస్సు పథకం

అమరావతి, అక్టోబర్ 16

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సార్వత్రిక ఎన్నికల హామీలలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభించేందుకు సిద్ధమైంది. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ దీని గురించి కీలక ప్రకటన చేస్తూ, దీపావళి సందర్భంగా ఉచిత సిలిండర్ పథకాన్ని ప్రారంభించి, ఆ మరుసటి రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలులోకి వస్తుందని తెలిపారు.

మహిళల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రవేశపెడుతున్నారని, ఇందులో రేషన్ కార్డులు, ఎన్టీఆర్ గృహాలు, పెన్షన్లు కూడా ఉన్నాయని చెప్పారు.

Join WhatsApp

Join Now

Leave a Comment