ఇకపై గుర్తింపు కార్డు లేకుండానే ఫ్రీ బస్సు జర్నీ…
తెలంగాణ ఆర్టీసీ మహిళల ఉచిత బస్సు పథకం (మహాలక్ష్మీ పథకం) అమలులో భాగంగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. పథకం అమలులో భాగంగా ప్రత్యేక బస్సులు, స్మార్ట్ కార్డుల జారీపై కసరత్తు తుది దశకు చేరింది. ప్రయాణికులకు బస్సుల నిర్వహణపై ఎప్పటికప్పుడు సమాచారం అందించేందుకు కొత్త యాప్ ద్వారా బస్సుల ట్రాకింగ్ అందుబాటులోకి తెస్తోంది. ఇకపై గుర్తింపు కార్డులుగా ఆధార్ అవసరం లేకుండా నిర్ణయాలు అమలు చేస్తోంది. మహిళలకు స్మార్ట్ కార్డులు ఇచ్చేందుకు హైదరాబాద్‌లో పైలట్ ప్రాజెక్టు ప్రారంభించి, ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని భావిస్తోంది.