విద్యార్థుల నైపుణ్యాభివృద్ధికి ఆనందిత ఫౌండేషన్ సేవలు అభినందనీయం – డీఈఓ భోజన్న
నిర్మల్, సెప్టెంబర్ 11
విద్యార్థుల భవిష్యత్తుకు మార్గదర్శనం చేస్తూ వారి నైపుణ్యాలను పెంపొందించడానికి ఆనందిత ఫౌండేషన్ చేస్తున్న కృషి ఎంతో అభినందనీయమని నిర్మల్ జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) దర్శనం భోజన్న అన్నారు, ఈ సందర్భంగా ఫౌండేషన్ సేవలను ఆయన ప్రశంసించారు,
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు స్కిల్ డెవలప్‌మెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మోటివేషన్, నైతిక విలువలు, మరియు కెరీర్ గైడెన్స్ వంటి అంశాలపై ఆనందిత ఫౌండేషన్ తరచుగా శిక్షణా తరగతులు నిర్వహిస్తోంది, ఈ సేవలకు గాను, ఫౌండేషన్ చైర్మన్ వాడేకర్ లక్ష్మణ్ డీఈఓ భోజన్నను ఘనంగా సత్కరించారు,
ఈ కార్యక్రమం అనంతరం, డీఈఓ భోజన్న మాట్లాడుతూ, విద్యార్థులకు అవసరమైన ఈ నైపుణ్యాలను పెంపొందించడానికి ఆనందిత ఫౌండేషన్‌కు విద్యాశాఖ పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు, విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవడానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన తెలిపారు.