బంద్‌ను విజయవంతం చేయాలని బీఆర్‌ఎస్ నాయకులకు మాజీ జడ్పీ చైర్మన్, బి.ఆర్.ఎస్ రాష్ట్ర కార్యదర్శి విఠల్ రావు పిలుపు

బీసీ సంఘం బంద్‌కు బీఆర్‌ఎస్ పూర్తి మద్దతు — కార్యకర్తలు చురుకుగా పాల్గొనాలని సూచన

మనోరంజని తెలుగు టైమ్స్ నిజామాబాద్ ప్రతినిధి అక్టోబర్ 17

రేపు నిర్వహించనున్న బంద్‌ను విజయవంతం చేయాలని బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలకు నిజామాబాద్ జిల్లా మాజీ జడ్పీ చైర్మన్, బి.ఆర్. ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి దాదన్నగారి విఠల్ రావు పిలుపునిచ్చారు. ఆయన నిన్న జరిగిన బీసీ జేఏసీ సంఘం సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా విఠల్ రావు మాట్లాడుతూ, బీసీ సంఘం పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న బంద్‌కు బీఆర్‌ఎస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తోందని తెలిపారు. బీసీల హక్కులు, సమాన అవకాశాల కోసం చేపడుతున్న ఈ పోరాటంలో ప్రతి నాయకుడు, కార్యకర్త చురుకుగా పాల్గొని ప్రజల్లో అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. రేపు బంద్‌ను విజయవంతం చేసేందుకు పార్టీ నాయకులు తమ తమ ప్రాంతాల్లో ప్రజలతో కలిసి రోడ్ల మీదకు రావాలని, బీసీ హక్కుల పరిరక్షణలో బీఆర్‌ఎస్ ఎప్పటికీ ముందుంటుందని ఆయన పేర్కొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment