జనసహిత పాదయాత్రకు బయలుదేరిన మాజీ ఎమ్మెల్యే
ముధోల్ మనోరంజని ప్రతినిధి ఆగస్టు 3
నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జన సహిత పాదయాత్రకు ముధోల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్- మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ ఆధ్వర్యంలో నాయకులు- కార్యకర్తలు బయలుదేరారు. జన సహిత పాదయాత్రకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరవుతున్నారు. క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా ప్రజలను కలుసుకుంటూ వారి సమస్యలను తెలుసుకొని పరిష్కరించడానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని తెలిపారు. ఆయనతో పాటు ముధోల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రావుల గంగారెడ్డి, నాయకులు రావుల శ్రీనివాస్, పోతారెడ్డి, అనిల్, మీనాజ్, ఎస్కే నజీమ్, హైమద్ తదితరులున్నారు