మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావును పరామర్శించిన ఆత్రం సుగుణక్క, బోరంచు శ్రీకాంత్ రెడ్డి
ఆదిలాబాద్: బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు సోదరుడు రాథోడ్ నర్సింగ్ నాయక్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క, ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రేఖ నాయక్, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి ఆదిలాబాద్ పట్టణంలోని వారి నివాసానికి వెళ్లి రాథోడ్ బాపూరావు కుటుంభ సభ్యులను పరామర్శించారు.రాథోడ్ నర్సింగ్ నాయక్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.వారి వెంట కాంగ్రెస్ పార్టీ ఎస్టి సెల్ రాష్ట్ర కన్వీనర్ సునిల్ జాదవ్,కాంగ్రెస్ పార్టీ మావల మండల అధ్యక్షుడు ధర్మపురి చంద్ర శేఖర్, మార్లవాయి మాజీ సర్పంచ్ కనక ప్రతిభ తదితరులు పాల్గొన్నారు.