యోగ శిక్షకురాలికి మాజీ ఎమ్మెల్యే సన్మానం

యోగ శిక్షకురాలికి మాజీ ఎమ్మెల్యే సన్మానం

యోగ శిక్షకురాలికి మాజీ ఎమ్మెల్యే సన్మానం

బైంసా మనోరంజని ప్రతినిధి సెప్టెంబర్ 13

బైంసా మండలం దేగాం గ్రామానికి చెందిన యోగ శిక్షకురాలు వెంకటోళ్ల స్రవంతి మూడు సంవత్సరాల నుండి యోగ శిక్షకురాలిగా జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో ప్రతిభను కనబరిచి అదిలాబాద్లో జరిగిన 6వ రాష్ట్ర స్థాయి యోగ పోటీలలో నిర్మల్ జిల్లా నుండి పాల్గొని నాలుగవ స్థానంలో నిలిచారు. నిర్మల్ జిల్లా స్థాయి యోగ పోటీలు తానూర్ మండల కేంద్రంలోని ఎమ్ఎస్ ఆర్ గార్డెన్ లో జిల్లా స్థాయి మహిళల సీనియర్ వయస్సు స్థాయిలో కేటగిరి (డీ) లో ప్రథమ స్థానంలో నిలిచినందుకు యోగ అసోసియేషన్ ఆధ్వర్యంలో వెంకటొళ్ళ స్రవంతికి మెమొంటో, షీల్డ్ బహుకరించారు. మాజీ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డీ నివాసంలో విడీసి ఆధ్వర్యంలో ఆమెకు సన్మానం చేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ప్రతి ఒక్కరు తమ వంతు రోజూ వారీ జీవన విధానంలో ఉదయపు నడక, యోగ ఆసనాలు చెయ్యడం వలన శారీరకంగా, మానసికంగా, దృఢంగా ఉంటారు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విడీసీ చైర్మన్ టేకుల లింగాన్న, మాజీ సర్పంచ్ శ్రీనివాస్, మాజీ జడ్పటిసి సూర్యం రెడ్డీ, మాజీ మాజీ వార్డ్ మెంబర్ అప్పం గోవర్ధన్ రెడ్డి, నాయకులు అయిండ్ల మోహన్ రెడ్డి, గడ్డిగరి చందూ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment