కుప్టీ గ్రామంలో బాధిత కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే జి. విఠల్ రెడ్డి

కుప్టీ గ్రామంలో బాధిత కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే జి. విఠల్ రెడ్డి

మనోరంజని తెలుగు టైమ్స్ కుబీర్ ప్రతినిధి అక్టోబర్ 16

కుప్టీ గ్రామంలో బాధిత కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే జి. విఠల్ రెడ్డి

నిర్మల్ జిల్లా కుబీర్ మండలం కుప్టీ గ్రామానికి చెందిన బోయిడిరాజు ఎర్రన్న జోర్డాన్‌లో ప్రమాదానికి గురై మృతి చెందడంతో, ఆ బాధాకర వార్త తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే జి. విఠల్ రెడ్డి గురువారం ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా జోర్డాన్‌లోని మేనేజర్‌తో కూడా మాజీ ఎమ్మెల్యే మాట్లాడి, శనివారం రోజున పార్థివ దేహం స్వదేశానికి వస్తుందని, హైదరాబాద్‌లోని ఎన్. ఆర్.ఐ బృందంతో సమన్వయం చేసి, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి అంబులెన్స్ సౌకర్యాన్ని హైదరాబాద్ నుండి ఇంటి వరకు అందిస్తానని హామీ ఇచ్చారు. అలాగే, ఇటీవల ఉల్చా సుధాకర్ కండక్టర్ మాతృమూర్తి స్వర్గస్తులవడంతో, వారి కుటుంబాన్ని కూడా పరామర్శించారు. అదేవిధంగా ఎ. కొండ దేవ్ బాయ్ కుటుంబాన్ని కూడా సందర్శించి సంతాపం తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ కళ్యాణ్, మాజీ జెడ్పిటిసి సభ్యులు శంకర్ చవాన్, కుబీర్ మాజీ సర్పంచ్ విజయకుమార్, మాలేగాం మాజీ సర్పంచ్ మహిపాల్ రెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ డి. రాములు, దత్తు, మల్లారెడ్డి, రామ్ రెడ్డి, సాహెబ్ రావు, ఆనంద్, దేవేందర్, మాజీ మార్కెట్ డైరెక్టర్ సాయన్న, ఎక్స్ ఎంపిటిసి సుభాష్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment