బాధిత కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే పరామర్శ

బాధిత కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే పరామర్శ

బైంసా మనోరంజని ప్రతినిధి అక్టోబర్ 11

బైంసా పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్. కాశినాథ్ మాతృమూర్తి ఇటీవలే మృతి చెందారు. విషయం తెలుసుకున్న ముధోల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి, మాజీ ఏమ్మెల్యే భోస్లె నారాయణ్ రావు పాటిల్ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కష్ట సమయంలోనే ధైర్యంగా ఉండాలని ఓదార్చారు. మాజీ ఎమ్మెల్యేతో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకర్ చంద్రే, మాజీ ఎంపీపీ చంద్రకాంత్, నాయకులు అట్టల్ దేవిదాస్, ముధోల్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గంగారెడ్డి, స్థానిక నాయకులు శ్రీకాంత్, సత్యనారాయణ, తదితరులు ఉన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment