రేవంత్ రెడ్డి రాసిచ్చిన నాలుగైదు ప్రశ్నలు అడిగారు: మాజీ మంత్రి కేటీఆర్

ఏసీబీ ఆఫీసు బయట కేటీఆర్ మాటల దృశ్యం

హైదరాబాద్: జనవరి 09, 2025

ఫార్ములా-ఈ కేసులో కేటీఆర్‌ విచారణ ముగిసింది. ఏసీబీ అధికారులు మాజి మంత్రి కేటీఆర్‌ను ఏడు గంటల పాటు విచారించి ప్రశ్నలకి సమాధానాలు రాబట్టారు.

 

  1. ఏసీబీ విచారణలో కేటీఆర్‌ పాల్గొన్న వివరాలు.
  2. రేవంత్ రెడ్డి ఇచ్చిన ప్రశ్నల ప్రస్తావన.
  3. పోలీసుల తీరుపై కేటీఆర్ అసహనం.

 

ఫార్ములా-ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్‌ ఏసీబీ ఎదుట హాజరై ఎనిమిదిగంటల పాటు విచారణకు సహకరించారు. రేవంత్ రెడ్డి రాసిచ్చిన ప్రశ్నల ఆధారంగా తమను ప్రశ్నించారని కేటీఆర్‌ పేర్కొన్నారు. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, ఈ కేసు రాజకీయ కక్షసాధింపుకే సంబంధించి ఉందని ఆరోపించారు. పోలీసుల తీరుపై కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

 

హైదరాబాద్: ఫార్ములా-ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్‌ను ఏసీబీ అధికారులు విచారణకు పిలిపించారు. ఈ విచారణ జనవరి 09న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి రాసిచ్చిన నాలుగైదు ప్రశ్నలను తిప్పి తిప్పి 40 రకాలుగా అడిగారని తెలిపారు.

“ఇది చెత్త కేసు. రేవంత్ రెడ్డి రాజకీయ కక్ష సాధింపుల కోసం ఈ కేసు పెట్టారు. నేను పోలీసుల ముందు పూర్తిగా సహకరించాను. ఇక్కడ ఎక్కడ అవినీతి ఉందని నేను ప్రశ్నించగా, వాళ్ల దగ్గర సమాధానం లేదు” అని కేటీఆర్ పేర్కొన్నారు.

తన విచారణ అనంతరం ఏసీబీ ఆఫీసు బయట మీడియాతో మాట్లాడిన కేటీఆర్, అక్కడ ఉన్న పోలీసుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. “మీడియా ప్రతినిధులు ప్రశ్నలు అడుగుతుండగా, వాళ్లను తోసే ప్రయత్నం ఎందుకు? నేను మాట్లాడితే పోలీసులకు ఎందుకు భయం?” అంటూ నిలదీశారు.

కేసు పట్ల ప్రభుత్వ ఒత్తిడి ఉందని, దీనితో ఎలాంటి లాభం ఉండదని కేటీఆర్ స్పష్టం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment