తుమ్మల నాగేశ్వరరావుపై మాజీ మంత్రి ఫైర్
మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత వీ శ్రీనివాస్ గౌడ్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై తీవ్రంగా మండిపడ్డారు. మాగంటి సునీత తన భర్తను గుర్తుచేసుకుని కన్నీళ్లు పెట్టుకుంటే దానిని డ్రామా, యాక్షన్ అనడం సరికాదని ఆయన మంగళవారం అన్నారు. కమ్మ సామాజికవర్గం ఓట్లతో గెలిచి మంత్రి అయిన తుమ్మల, అదే వర్గానికి చెందిన ఎమ్మెల్యే చనిపోతే ఉప ఎన్నికలో ఆయన భార్య, పిల్లలు ప్రచారం చేస్తే దానిని యాక్షన్ అనడం అమానుషమని గౌడ్ విమర్శించారు. తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ వెంటనే మాగంటి సునీతకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
తుమ్మల నాగేశ్వరరావుపై మాజీ మంత్రి ఫైర్
Oct 14, 2025,