గుస్సాడి కనక రాజు మృతికి మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పరామర్శ

M4 న్యూస్ (ప్రతినిధి),

నిర్మల్ : అక్టోబర్ 28

కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం మార్లవాయి స్వగ్రామంలో ఇటీవల ప్రముఖ నృత్యకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత గుస్సాడి కనకరాజు మృతి పట్ల మాజీ మత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గుస్సాడీ నృత్యానికి కనకరాజు చేసిన సమున్నతమైన సేవలను, అంకితభావాన్ని అల్లోల కొనియాడారు. సాంస్కృతిక వారసత్వ చిహ్నలేవీ వాటి స్వాభావిక స్వరూపాన్ని కోల్పోకూడదన్న కనకరాజు తపనను ప్రశంసించారు. ఆయన కుటుంబ సభ్యులకు, తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వీరితోపాటు విజయ డైరీ మాజీ చైర్మన్ లోక భూమరెడ్డి, మాజీ MLA బాపురావ్, మాజీ MLA రేఖా శ్యామ్ నాయక్ లు ఉన్నారు
లక్షణచాందా మండలం చామన్పెల్లి గ్రామంలోని మండాల్ బొమ్మేన రాజేందర్ అనారోగ్యంతో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బొమ్మేన రాజేందర్ ఆరోగ్య విషయాలు అడిగి తెలుసుకున్నారు. వీరితోపాటు రఘునందన్ రెడ్డి, డిసిసిబి Vic చైర్మన్, వేంకట్ రాంరెడ్డి, ZRSS చైర్మన్, మాణిక్ రెడ్డి ప్యాక్స్ చైర్మన్ పాతని భూమెష్, మాజీVic ఎంపీపీ, తదితరులు ఉన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment