దశకర్మకు హాజరైన మాజీ జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు

దశకర్మకు హాజరైన మాజీ జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు

జన్నేపల్లి గ్రామంలో క్రీ.శే రాజేశ్వర్ రావు గారి ద్వాదశ కర్మ

మాజీ జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు నివాళులు

మనోరంజని తెలుగు టైమ్స్ నిజామాబాద్ ప్రతినిధి అక్టోబర్ 15

నిజామాబాద్ జిల్లా నవిపేట మండలంలోని జన్నేపల్లి గ్రామంలో బుధవారం మహేశ్వర ఫంక్షన్ హాల్‌లో సుభాష్ రావు, సునీల్ రావు గార్ల పితృమూర్తి క్రీ.శే రాజేశ్వర్ రావు గారి ద్వాదశ కర్మ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు హాజరయ్యారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, రాజేశ్వర్ రావు ను స్మరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ — “రాజేశ్వర్ రావు నా సన్నిహిత మిత్రుడు. ఆయన మరణం చాలా బాధాకరం. ఇంత త్వరగా ద్వాదశ కర్మ జరగడం మనసు తట్టుకోవడం కష్టం,” అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వి. నాగేశ్వరరావు, ప్రదీప్ రావు, డి. రాజేశ్వర్ రావు, ఉమాపతిరావు, పి. శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment