- బాసర త్రిబుల్ ఐటీకి నూతనంగా వచ్చిన ఆర్జీయూకేటీ వైస్ ఛాన్స్లర్ గోవర్ధన్‌ను కలిసిన బిజెపి నాయకులు పోగుల రాజేశ్వర్.
- బాసర ప్రాంతంలోని నిరుద్యోగ సమస్యలు ముఖ్యంగా గుర్తించిన రాజేశ్వర్.
- స్థానిక యువకులకు ఉపాధి అవకాశాలపై చర్చ.
బాసర: అక్టోబర్ 26
– రాజీవ్ గాంధీ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన విశ్వవిద్యాలయానికి కొత్తగా వచ్చిన ఆర్జీయూకేటీ వైస్ ఛాన్స్లర్ గోవర్ధన్‌ను కలిసిన బాసర మాజీ జడ్పిటిసి నాయకుడు పోగుల రాజేశ్వర్, ఈ కళాశాల అభివృద్ధికి సంబంధించి ప్రాంతంలో నిరుద్యోగ సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. బాసర యువకులకు ఉపాధి కల్పించాలని ఆయన కోరారు.
బాసర, అక్టోబర్ 26:
రాజీవ్ గాంధీ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన విశ్వవిద్యాలయం బాసర త్రిబుల్ ఐటీకి కొత్తగా వచ్చిన ఆర్జీయూకేటీ వైస్ ఛాన్స్లర్ గోవర్ధన్‌ను ఉమ్మడి ముధోల్ మండలం మాజీ జడ్పిటిసి, బిజెపి నాయకుడు పోగుల రాజేశ్వర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా ఆయన గోవర్ధన్‌ను పూలమాలలతో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా, రాజేశ్వర్ మాట్లాడుతూ, “బాసర త్రిబుల్ ఐటీ గతంలో రేణుకపురాని గ్రామం ప్రాంతంలో ఏర్పడినతర్వాత, ఈ ప్రాంతం పలు సమస్యలతో ఎదుర్కొంటోంది. రాజీవ్ గాంధీ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన విశ్వవిద్యాలయం నిర్మించటం ఎంతో సంతోషకరమైన విషయం. అయితే, కళాశాల కోసం భూములు కోల్పోయిన వారికి ఇచ్చిన ఉద్యోగ హామీ ఇప్పటివరకు అమలు కాలేదు” అని తెలిపారు.
అతను, “ప్రస్తుతం బాసర గ్రామంలో నిరుద్యోగులు ఉన్నారు, ఆవశ్యకమైన ఉద్యోగ అవకాశాలు అందించాలని, ముఖ్యంగా మహారాష్ట్ర నిజాంబాద్ జిల్లా సోదర ప్రాంతాల నుండి వచ్చినవారికి ప్రాధాన్యత ఇవ్వకుండా, స్థానిక యువకులకు కూడా ఉపాధి అవకాశాలను కల్పించాలని” వైస్ ఛాన్స్లర్ గోవర్ధన్‌ను కోరారు.