నిజామాబాద్ 50వ డివిజన్‌లో అభివృద్ధిపై మాజీ కార్పొరేటర్ బట్టు రాఘవేంద్ర – ఇంచార్జ్ ధర్మారం నవీన్ పోటీ
మనోరంజని తెలుగు టైమ్స్ నిజామాబాద్ నవంబర్ 28
నిజామాబాద్ నగరంలోని 50వ డివిజన్ పరిధిలో అభివృద్ధి అంశంపై మాజీ కార్పొరేటర్ బట్టు రాఘవేంద్ర, డివిజన్ ఇంచార్జ్ ధర్మారం నవీన్ ఇద్దరూ పోటీగా ముందుకు రావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రజల సమక్షంలో చర్చలకు కూడా సిద్ధమని ఇద్దరు నాయకులు ప్రకటించారు. ప్రజలే న్యాయనిర్ణేతలని చెబుతూ, కార్పొరేటర్ పదవిలో ఉన్నా – లేకున్నా అభివృద్ధి చేయడం కొనసాగిస్తున్న బట్టు రాఘవేంద్ర తీరు హర్షణీయమని స్థానికులు అభిప్రాయపడ్డారు. అదే సమయంలో “అభివృద్ధిలో నేనూ భాగస్వామినే” అంటూ డివిజన్ ఇంచార్జ్ ధర్మారం నవీన్ ముందుకు రావడాన్ని కూడా ప్రజలు స్వాగతిస్తున్నారు. ఒక మహిళ మాట్లాడుతూ,
“పార్టీలు వేరైనా… అభివృద్ధియే మా మతం. డివిజన్ కోసం ఇద్దరూ పనిచేయడం మాకు శుభపరిణామం” అని అభిప్రాయపడ్డారు. ఇరువురు నాయకులు ఎప్పటికప్పుడు డివిజన్ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, వారి సంక్షేమానికి కృషి చేస్తున్నారని స్థానికులు పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా అభివృద్ధి, సంక్షేమం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని ఇరువురు నాయకులు డివిజన్ ప్రజలకు హామీ ఇచ్చారు.