క్షమాగుణం మనోశాంతికి వరం
ప్రకృతి మనిషికి ఇచ్చిన గొప్ప వరం క్షమాగుణం.జీవకోటిలో మానవునికి వున్న గొప్ప లక్షణం క్క్షమా గుణం కలిగి ఉండటం వల్ల మానసిక ఆరోగ్యానికి మనోశాంతికి ఉపయోగపడుతుంది.
ప్రతి సంవత్సరం 26జూన్ రోజున అమెరికాలో క్షమాపణ దినోత్సవం జరుపుకుంటారు.క్రిస్టియన్ ఎంబసీ అంబాసిడర్స్ 1994 సం” నుండి ఈ రోజును జరపడం ప్రారంభించారు.
ఇతర వ్యక్తుల పట్ల మనకున్న కోపం పగ మానసిక ఆరోగ్య మీద కలిగే ప్రభావం పర్యవసానం గురించి అవగాహన కలిగించడంద్వారా క్షమా గుణం ప్రాధాన్యతను బోధించడం అవగాహన చైతన్యంకలిగిస్తారు .
క్షమా గుణం ప్రతికూల భావాల నుండి మనల్ని మనం రక్షించుకోవడానికి సహాయపడుతుంది.
క్షమాపణ మీకు అన్యాయం చేసిన వారి పట్ల కోపం పగ చెడు ఆలోచనను విడిచిపెట్టెట్లు చేస్తుంది.
క్షమాగుణం_ సైక్రియాటిస్టుల అభిప్రాయం.
అవతలి వ్యక్తిని క్షమించడం కాదు మిమ్మల్ని వెనకకు నెట్టేవేసే ప్రతికూల భావోద్వేగాల నుండి మిమ్మల్ని మీరు విడుదల చేసుకోవడం అని ప్రముఖ సైక్రయాటిస్ట్ ల అభిప్రాయం.
క్షమాపణ _అవగాహానను పెంచుతుంది.
క్షమాపణ ఇతరుల పట్ల అవగాహన తాదాత్మ్యకతను పెంపొందించుకోవడానికి సంకేతంలాగ పనిచేస్తుంది.
అంతర్గత శాంతి స్థిరత్వం.
మనిషిలో అంతర్గత శాంతి స్థాపనకు మానసిక ప్రశాంతత స్థిరత్వానికి సహాయ పడుతుంది.
క్షమాపణ వల్ల కలిగే ప్రయోజనాలు.
ఒత్తిడిని తగ్గిస్తుంది
మానవునికి కోపం ఆగ్రహం ఏర్పడితే దీర్ఘకాలిక మానసిక ఒత్తిడికి దారితీస్తుంది. తల.నొప్పి కండరాల ఒత్తిడి ఏకాగ్రత కు బంగం కలుగుతుంది. క్షమాపణ.మనకు హాని కలిగించే ప్రతికూల భావోద్వేగాల నుండి రక్షిస్తుంది.ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది.
మానసిక స్థితిని
మెరుగుపరుస్తుంది.
క్షమాపణ కోపం ఆగ్రహం చెడు ఆలోచనను తగించుకోవడనికి మానసిక స్థితిని మెరుగు పరుచుకోవడనికి పాజిటివ్ ఆలోచనలు పెంపొందిస్తుంది
నిద్రను మెరుగు పరుస్తుంది.
మనం తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనప్పుడు నిధ్రపోవడం కష్టం క్షమాపణ మన మనసును మరియు శరీరాన్ని శాంత పరచడానికి ఉపయోగ పడి విశ్రాంతి మనోశాoతి మన వశమౌతుంది .నిద్ర వ్యవస్థను మెరుగు పరుస్తుంది
సంతోషం సంతృప్తి పెరుగుతుంది.
మనం జీవితంలో ఎవరినైనా క్షమిస్తే మనలో కలిగే ప్రతికూల భావాలను
భావోద్వేగాలను అదుపులో ఉంచుకునే అవకాశాలు మెరుగు పడతాయి. పాజిటివ్ దృక్పథం ఏర్పడుతుంది. సానుకూల అంశాల పై దృష్టి పెట్టే అవకాశం కలుగుతుంది. మనలో శక్తి సామర్ధ్యాలు పెరిగి ఉత్పాదక సామర్థ్యం పెరిగి జీవన ప్రమాణాలు పెరుగుతాయి . సంకల్ప బలం ఆనందం సంతోషం సంతృప్తి కలుగుతుంది.
సంబంధాలు మెరుగు పడతాయి.
పరిశ్రమల్లో దేవారంగల్లో పనిచేసే ఉద్యోగ సిబ్బంది చేసిన పొరపాట్లను సవరించడం నూతన ప్రణాళికలను అమలు చేయడంలో జరిగే తప్పిదాలను గుర్తిస్తూ క్షమిoచడం యాజమాన్యం సిబ్బంది మధ్య సత్ సంబంధాలు ఏర్పడతాయి తద్వారా వ్యక్తులు ఇతర వ్యక్తులతో ఆరోగ్యకరమైన సంబంధాలు పెంపొందించుకోవడానికి దోహద పడుతుంది. పరస్పర విశ్వాసం నమ్మకం పునర్జీవింప చేయవచ్చు. అవగాహన ఆత్మీయత పెరుగుతుంది.
ఆత్మ గౌరవం మెరుగైన
సామాజిక విలువలు.
క్షమా గుణం కలిగి ఉండటం వల్ల మానసిక ఒత్తిడి నుంచి బయటపడతారు. వ్యక్తిత్వ వికాసం కలిగి వ్యక్తి సంపూర్ణ మూర్తివత్వాన్ని కలిగి వుంటాడు. స్వయం రక్షణ స్వయం కరుణ దయ ఫైదృష్టి పెట్టడం వల్ల వ్యక్తుల ఆత్మగౌరవం పెరిగి సామాజిక మానవీయ.విలువలు ఇనుమడిస్థాయి. సమాజంలో హింసాత్మక ధోరణులు తగ్గుతాయి.
దేశాల మధ్య క్షమా గుణం ఉండడం వల్ల
శాంతి సహనం సామరస్యం సంఘీభావం పరస్పర సహకారం
సమరసత ఏర్పడి మెరుగైన సమాజ నిర్మాణం సిద్ధిస్తుంది.
యుద్ధాలు ఉగ్రవాదం ఆయుధ పోటీ లేని వసుధైక ప్రపంచాన్ని
నిర్మించడానికి క్షమా గుణం గొప్ప ఆయుధంగా పనిచేస్తుందని
సామాజిక శాస్త్రవేత్తలు చెప్పడంలో అతిశయోక్తి లేదన్న విషయం విస్మరించకూడదు
నేదునూరి కనకయ్య
అధ్యక్షులు
తెలంగాణ ఎకనామిక్ ఫోరం
కరీంనగర్9440245771