జనావాసాల్లోకి వచ్చిన పైతాన్ పామును అడవిలో వదిలివేసిన ఫారెస్ట్ అధికారులు.
మంచిర్యాల, మనోరంజని ప్రతినిధి
భీమారం మండలం ఎల్బీ పేట గ్రామంలో మోహన్ రెడ్డి ఇంటి వెనకాల పైతాన్ పాము వలలో చిక్కుకున్నది. ఈ విషయం తెలుసుకున్న అటవీ అధికారులు డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ జి. సుధాకర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ బి. శ్రీకాంత్ లు రెస్క్యూ చేసి, ఆ పైథాన్ పామును పట్టుకొని ఎల్కేశ్వరం బీట్‌లోని, కంపార్ట్ మెంట్ నెంబర్ 315 లో చెక్ డ్యామ్ ప్రాంతం సమీపంలో సురక్షితంగా విడిచిపెట్టడం జరిగింది. ఎల్బీ పెట్ ప్రజలు అటవీ అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు