ఆహార భద్రత కమిటీలు సమర్థవంతంగా పనిచేయాలి
బాసర మండల విద్యాధికారి జి. మైసాజీ
ఎమ్4 ప్రతినిధి ముధోల్
ఆహార భద్రత కమిటీలు సమర్థవంతంగా చేయాలని బాసర మండల విద్యాధికారి గడ్పాలె మైసాజి పేర్కొన్నారు. శుక్రవారం బాసర మండల కేంద్రంలోని విద్యావనరుల కేంద్రంలో మధ్యాహ్న భోజన ఆహార భద్రత కమిటీల ఏర్పాటుపై ప్రధానోపాధ్యాయులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమిటీల ఏర్పాటులో పోషకులకు పూర్తిస్థాయి అవగాహన కల్పించాలని, పాఠశాల అభివృద్ధికి పాఠశాల స్థాయి కమిటీలు ఎంతో మేలు చేస్తాయన్నారు. కమిటీ ఏర్పాటులో పురుష పోషకులతో పాటు మహిళలకు ప్రాధాన్యత కల్పించేలా చూడాలన్నాయారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, మండల వనరుల సిబ్బంది స్వాతి గడ్పాలె, సిసిఓ మహేష్ బంగారు, సిఆర్పీలు, తదితరులు పాల్గొన్నారు.