🔹 మహబూబాబాద్ జిల్లా కేసముద్రం గిరిజన గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్
🔹 జీరా రైస్‌లో పురుగులు రావడంతో విద్యార్థులకు వాంతులు
🔹 6వ తరగతి విద్యార్థిని అలావత్ సంజన తీవ్ర అస్వస్థత
🔹 ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థిని ఆరోగ్యంపై ఆందోళన
🔹 ఫోన్ చేసినప్పటికీ స్పందించని ప్రిన్సిపాల్
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం గిరిజన గురుకుల సంక్షేమ పాఠశాలలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. జనవరి 28న స్కూల్‌లో అందించిన జీరా రైస్‌లో పురుగులు రావడంతో 6వ తరగతి విద్యార్థిని అలావత్ సంజన వాంతులు చేసుకుంది.
అస్వస్థతకు గురైన సంజనను ఇంటికి పంపించిన ప్రిన్సిపాల్, వార్డెన్ స్పందించలేదని ఆమె తండ్రి రవి ఆరోపించారు. అస్వస్థత తగ్గకపోవడంతో జనవరి 29న సంజనను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది. విద్యార్థుల ఆరోగ్యాన్ని పట్టించుకోని స్కూల్ యాజమాన్యం తీరుపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గురుకులాల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు అధికారుల అలసత్వాన్ని వెల్లడిస్తున్నాయి. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని భోజన పదార్థాల నాణ్యతపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.