సామాజిక సేవలో ఫుడ్ బ్యాంక్ బైంసా సేవలు అమోఘం
20 వేల మంది అనాధలకు-అభాగ్యులకు అన్నదానం

ఎమ్4 ప్రతినిధి ముధోల్
సామాజిక సేవలో ముధోల్ నియోజకవర్గ వ్యాప్తంగా ఫుడ్ బ్యాంక్ భైంసా సేవలు ప్రత్యేకతను చాటుకున్నాయి. ఒక మంచి సంకల్పంతో నిరుపేదల-అభాగ్యుల ఆకలితిర్చాలనే ఉద్దేశంతో మూడున్నర సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన ఫుడ్ బ్యాంక్ భైంసా సంస్థ దాదాపు 1271రోజులు పూర్తి చేసుకొనడం జరిగింది. ఎన్ని అవరోధాలు ఎదురైనా ఎన్ని ఆటంకాలు ఎదురైనా రాత్రనక పగలనక వర్షంను ఎండను లెక్క చేయకుండా కుటుంబ సభ్యుల సహకారంతో ఒకే ఒక్కడు ఫుడ్ బ్యాంక్ భైంసా వ్యవస్థాపకులు ఎం. ఆంజనేయులు కొనసాగిస్తున్న మహత్తర కార్యక్రమం ఒక మహాయజ్ఞంలా కొనసాగిస్తున్నారు. అదేవిధంగా నిర్మల్ -నిజామాబాద్ జిల్లాలో బస్టాండు-రైల్వే స్టేషన్లో- రోడ్డు పక్కన నివసించే మానసిక రోగులకు, యాచకులకు వలస కార్మికులకు, ఇటుక బట్టిలలో పనిచేసే నిరుపేద కార్మికులకు దాదాపు 20 వేయిల మందికి అన్నదానం చేయడం జరిగింది. ఎన్ని అవాంతరాలు అడ్డు వచ్చినా సంకల్ప బలం ముందు నిల్వలేవని నిరూపించారు. పేదలకు సేవ చేయాలనే తపన అవరోధాలను అధిగమించేందుకు అవకాశాలను సృష్టిస్తుంది. మారుమూల గ్రామం నుండి సేవా కార్యక్రమాలను ప్రారంభించి ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులను సంపాదించడం ఫుడ్ బ్యాంక్ బైంసాకు దక్కుతుంది.
దాతలకు ధన్యవాదాలు….
మహోన్నత కార్యక్రమం కొనసాగడానికి ప్రతి నెల ఆర్థిక సహాయం అందిస్తున్న మరియు ఫుడ్ బ్యాంక్ భైంసా వాహనం కొనడానికి దాతలు సాయం అందించారు. దాతల సహకారంతో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయి. సమాజంలో ప్రతి ఒక్కరు తనవంతుగా సహాయ సహకారాలు అందించడం ఆనందాన్ని కలిగించింది. సేవా కార్యక్రమాలను గుర్తించేవారు ఉన్నారనే ధీమాతోనే కార్యక్రమాలను కొనసాగిస్తున్నాము. ఇకముందు సైతం దాతల సహకారంతో సేవా కార్యక్రమాలను కొనసాగుతాయి.