వ్యక్తిగత విమర్శలు మానుకొని అభివృద్ధి పై దృష్టి సారించండి
నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడింది ఎవరో ప్రజలు గమనిస్తున్నారు
కుబీర్ మనోరంజని ప్రతినిధి సెప్టెంబర్ 16
మొన్న జరిగిన బిజెపి కార్యకర్తల ప్రెస్ మీట్ లో మాజీ శాసనసభ్యులు విట్టల్ రెడ్డి గత పది సంవత్సరాలు ఏ పని కూడా చేయలేదని కుబీర్ మండల బిజెపి నాయకులు మాట్లాడటం జరిగింది. బైంసాకు వెళ్లే రోడ్డు డబుల్ రోడ్డు ను చేసింది మాజీ శాసనసభ్యులు విట్టల్ రెడ్డి అన్న విషయం మీకు తెలవదా మాజీ శాసనసభ్యులు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కుబీర్ మండలంలో సుమారు 25 దేవాలయాలకు పైగా నిధులు, కళ్యాణ మండపాలకు కూడా నిధులు మంజూరు చేయించారు. అన్ని కులా సంఘాల భవనాలకు నిధులు కూడా మంజూరు చేయించారు. మండల కేంద్రంలో గ్రంథాలయం నిర్మాణo చేయించింది కూడా మాజీ ఎమ్మెల్యే కుబీర్ మార్కెట్ కమిటీలు సిసి రోడ్డు నిర్మాణం, షెడ్డు నిర్మాణం ఒక కోటి 50 లక్షలు ఇంకా అదనపు నిధులతో కూడా పల్సీ గ్రామంలో గోదాముల నిర్మాణం కూడా రైతుల శ్రేయస్సు కోసం నిర్మించటం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నవి. మీ ఎమ్మెల్యే మొన్న ఎంపీ లార్డ్స్ వస్తే కుబీర్ మండలానికి ఎన్ని నిధులు కేటాయించారు. వచ్చిన నిధులు మొత్తం బైంసా పట్టణ కేంద్రానికే కేటాయించారు. మరి మీరు ఎందుకు కుబీర్ మండలానికి నిధులు కావాలని అడగలేదు. ఏమైనా అంటే మా నాయకుడిని విమర్శిస్తే ఊరుకోమని అంటున్నారు. మీ నాయకుడు గెలిచి రెండు మూడు నెలలు కాలేదు సుమారు 22 నెలలు గడిచింది. ఇంకా నియోజకవర్గంలో చాలా పనులు ఇంకా అలానే ఉన్నవి. ఏమైనా అంటే మీరు పది సంవత్సరాలు చేయలేదు కాబట్టి మిమ్మల్ని ఓడగొట్టారు అని అంటున్నారు. మీరు గెలిచి 22 నెలలు అయింది ఇంకా ఎన్ని రోజులు చెప్తారు. గత పది సంవత్సరాలు అభివృద్ధి జరగలేదు అభివృద్ధి జరగలేదు అనడానికి మిమ్మల్ని ముధోల్ నియోజకవర్గ ప్రజలు గెలిపించింది మీరు అభివృద్ధి చేస్తారనే కదా గెలిపించింది. గత పది సంవత్సరాలు అభివృద్ధి ఏమి జరిగింది అనేది ప్రజలకు తెలుసు. సీఎం సహాయ నిధి చెక్కులను పంచి ఎన్నో పేద కుటుంబాలకు అండగా మన మాజీ శాసనసభ్యులు గనిలిచారు. ఏమైనా అంటే సిసి రోడ్లకు డ్రైనేజీలకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది అని అంటున్నారు. అసలు మనం మన తెలంగాణ రాష్ట్రం నుండి కేంద్ర ప్రభుత్వంకు ఎంత టాక్స్ కడుతున్నామో అందులో సగం కూడా మనకు ఇవ్వడం లేదు. మొత్తం బిజెపి పరిపాలత ప్రాంతాల్లో ఇస్తున్నారు. దీనిపై ఎవ్వరు కూడా మాట్లాడరు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నవి ఇలా ప్రెస్ మీట్ లు పెట్టడం మానేసి అభివృద్ధి పైన దృష్టి సారించండి. లేకపోతే లోకల్ ఎలక్షన్ లో ప్రజలు మీరు ఇచ్చిన హామీలు అన్ని ప్రజలకు గుర్తున్నాయి. వాళ్లు కచ్చితంగా నిలదీస్తారు. వ్యక్తిగత విమర్శలు మానేసి అభివృద్ధి పైన దృష్టి పెట్టాలి లేకపోతే మీ నాయకుడు ఏ గ్రామానికి వెళ్లిన మీరు ఎలక్షన్లో ఇచ్చిన హామీలన్నీ గుర్తు చేస్తూ ఉంటాం. ఈ కార్యక్రమంలో ఎఎంసి చైర్మన్ గోనె కళ్యాణ్, వైస్ చైర్మన్ హైమద్, మాజీ జడ్పిటీసి శంకర్ చవాన్, మాజీ చైర్మన్ దొంతుల రాములు, మాజీ సర్పంచ్ విజయ్ కుమార్, మాజీ ఏ ఏం సి చైర్మన్ కందూర్ సంతోష్, మాజీ సర్పంచ్ దేవేందర్, మాజీ ఎంపిటిసి నాగలింగం, మాజీ సర్పంచ్ బంక ఆనంద్, డైరెక్టర్లు అరుణ్, రాజాసింగ్, ప్రహళ్లద్, సత్యనారాయణ, వెంకటేష్ జుముడా మాజీ సర్పంచ్ సురేష్, మాజీ సర్పంచ్లు గంగాధర్, పర్డి గంగయ్య, మిలింద్, నాయకులు సూది రాజన్న, కందూరు సాయినాథ్, మల్లేష్ యాదవ్, అగ్గు మారుతీ, సాహెబ్ రావు పటిల్, బోడిగం సాయినాథ్, వడ్ల దత్తాత్రే దొంతుల మహేష్, పోగు లింగన్న తానూరు అంజయ్య, మండల కార్యకర్తలు ఉన్నారు.