పదవ తరగతి విద్యార్థులపై దృష్టి సారించండి
జిల్లా విద్యాధికారి రామారావు
మనోరంజని ప్రతినిధి
ముధోల్ : జనవరి 22
పదవ తరగతి విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా విద్యాధికారి రామారావు అన్నారు. బుధవారం ముధోల్ మండలం అష్ట గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశాలను ఆయన సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతుల ద్వారా ప్రోత్సహించాలని ఆదేశించారు. పదవ వార్షిక పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు.
విద్యార్థుల కోసం పాఠశాలలు ఏర్పాటు చేసిన మరుగుదొడ్లను పరిశీలించారు. అదేవిధంగా విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి ఉపాధ్యాయులకు సలహాలు సూచనలు ఇచ్చారు. విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు