నేటి నుంచి ఫ్లిప్‌కార్ట్ ‘బిగ్ ఫెస్టివ్ ధమాకా సేల్’ ప్రారంభం
మనోరంజని తెలుగు టైమ్స్ – అక్టోబర్ 04, 2025
ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ వినియోగదారులకు మరో సూపర్ ఆఫర్‌ను అందించింది. ఇటీవల ముగిసిన ‘బిగ్ బిలియన్ డేస్ సేల్’కు కొనసాగింపుగా, కంపెనీ శనివారం నుంచి ‘బిగ్ ఫెస్టివ్ ధమాకా సేల్’ను ప్రారంభించింది.
ఈ సేల్ అక్టోబర్ 8 వరకు కొనసాగనుంది. సేల్ సమయంలో హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్, డెబిట్ కార్డులపై 10% డిస్కౌంట్, అలాగే ఎక్స్ఛేంజ్ బోనస్, నోకాస్ట్ ఈఎంఐ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
ఇదే సమయంలో ప్రత్యర్థి ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ కూడా తన ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్’ను కొనసాగిస్తోంది. దీతో ఆన్‌లైన్ మార్కెట్‌లో పోటీ మరింత వేడెక్కింది