పోలీసు అమరవీరులను స్మరించుకుంటూ ఫ్లాగ్ డే ర్యాలీ
మనోరంజని ప్రతినిధి – నిజామాబాద్
ఫ్లాగ్ డే సందర్భంగా పోలీసు అమరవీరులను స్మరించుకుంటూ, నిజామాబాద్ నగరంలో సైకిల్ మరియు మోటార్ సైకిల్ ర్యాలీ ఘనంగా నిర్వహించబడనుంది. ఈ ర్యాలీ పులాంగ్ చౌరస్తా నుండి నెహ్రూ పార్క్ వరకు ఉదయం 8:30 నుండి 10 గంటల వరకు కొనసాగుతుంది.
ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రత్యేక సందేశం నెహ్రూ పార్క్‌లో ఇవ్వనున్నారు. కార్యక్రమంలో ఎన్సీసీ విద్యార్థులు, క్రీడాకారులు పాల్గొంటారని ట్రాఫిక్ అసిస్టెంట్ కమిషనర్ మస్తాన్ అలీ తెలిపారు.
ఎలాంటి ట్రాఫిక్ ఆంక్షలు ఉండబోవని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం నగర పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకే జరుగుతుందని, ట్రాఫిక్ విభాగం సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ సహా పోలీసులు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.