న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.. ఐదుగురు మృతి
అమెరికాలోని న్యూయార్క్‌లో కాల్పుల కలకలం రేపింది. మన్‌హట్టన్‌లో అర్ధరాత్రి జరిగిన కాల్పుల్లో ఐదుగురు వ్యక్తులు మృతి చెందారు. ఓ గుర్తుతెలియని దుండగుడు భవనంలోకి ప్రవేశించి విచక్షణరహితంగా కాల్పులు జరిపాడు. కాల్పుల శబ్దం వినగానే భయాందోళనకు గురైన స్థానికులు భవనాల నుంచి పరుగులు తీశారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దుండగుడి కోసం గాలింపు కొనసాగుతోంది