రూ.7 వేలు కోట్లు దాటిన బాణసంచా అమ్మకాలు
దేశవ్యాప్తంగా దీపావళి పండుగ సందర్భంగా రికార్డు స్థాయిలో బాణసంచా అమ్మకాలు జరిగాయి.
బాణసంచా వ్యాపారుల సమాఖ్య నివేదికల ప్రకారం.. పండుగ సీజన్లో సుమారు రూ.7 వేల కోట్ల విలువైన బాణసంచా అమ్మకాలు జరిగాయి. గత సంవత్సరం రూ.6 వేల కోట్ల టర్నోవర్తో పోలిస్తే, ఈ ఏడాది రూ. వెయ్యి కోట్ల పెరుగుదల నమోదయ్యింది. తమిళనాడులోని శివకాశి, విరుదునగర్, సత్తూరులో అత్యధికంగా అమ్మకాలు జరిగాయి