కోటగల్లీలో షార్ట్ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం
₹2.80 లక్షల నగదు అగ్నికి ఆహుతి
మనోరంజని తెలుగు టైమ్స్ – నిజామాబాద్, నవంబర్ 29
నిజామాబాద్ నగరంలోని కోటగల్లీలో శుక్రవారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. రాత్రి 9 గంటల సమయంలో జరిగిన ఈ ఘటనలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ ఇంటిలో మంటలు చెలరేగాయి. ఆ సమయంలో ఇంటి సభ్యులు విందు కార్యక్రమానికి వెళ్లడం వల్ల ప్రాణనష్టం తప్పింది. ఈ ప్రమాదంలో ₹2,80,000 నగదు పూర్తిగా దగ్ధం అయినట్లు ఇల్లు యజమాని జహీదా బేగం తెలిపారు. కంటి ఆపరేషన్ కోసం సిద్ధం చేసిన ఈ మొత్తమంతా అగ్నికి ఆహుతి కావడంతో తీవ్ర మనస్థాపం వ్యక్తం చేశారు. మంటల్లో ఇల్లు పూర్తిగా కాలిపోయి నష్టనష్టమైంది. ఘటన స్థలానికి చేరుకున్న మాల మహానాడు అధ్యక్షులు, కార్యదర్శులు పరిస్థితిని పరిశీలించి మాట్లాడారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున తగిన నష్టపరిహారం అందించాలని వారు కోరారు. ఈ సందర్భంగా మాల మహానాడు కార్యదర్శి సక్కి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.