శ్రీ అక్షర విద్యార్థుల క్షేత్రస్థాయి పర్యటన
ఎమ్4 ప్రతినిధి ముధోల్
మండల కేంద్రమైన ముధోల్ లోని శ్రీ అక్షర విద్యార్థులు ఆరవ తరగతికి చెందిన విద్యార్థులు పాఠ్యాంశంలో భాగంగా బుధవారం క్షేత్రస్థాయి పర్యటన చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు తపాలా శాఖ- ప్రభుత్వ ఆసుపత్రి-పోలీస్ స్టేషన్ను సందర్శించి ప్రభుత్వం ప్రజల పట్ల తీసుకుంటున్నటువంటి జాగ్రత్తలు, ప్రభుత్వం ప్రజల పట్ల అందుబాటులో ఎలా ఉంటుంది అనే విషయంపై క్షేత్ర పర్యటన చేయడం జరిగింది. సాంఘిక శాస్త్రంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం అను పాఠ్యాంశంలోని అంశాలను తెలుసుకోవడానికి ప్రత్యక్షంగా పర్యటించడంతో ప్రభుత్వం ప్రజల కోసం వివిధ రకాల శాఖల ద్వారా ఏ రకంగా అందుబాటులో ఉందో విషయాన్ని సంబంధిత శాఖల అధికారులు మా విద్యార్థులకు క్లుప్తంగా వివరించడం జరిగింది. తపాల శాఖ ద్వారా ప్రజలకు ఏ రకమైన ఉపయోగాలు ఉంటాయో వాటి గురించి పి. గంగయ్య, పంకజ్ క్లుప్తంగా వివరించారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలు తదితర విషయాల గురించి, రక్తపరీష నమూనాలను వైద్యులు డాక్టర్ సువర్ధన్ విద్యార్థులకు తెలియజేశారు. అదేవిధంగా ముధోల్ పోలీస్ స్టేషన్లో పోలీసులు ప్రజల పట్ల ఏ రకంగా అందుబాటులో ఉంటారు, రక్షణ పట్ల ఏ రకంగా చర్యలు వ్యక్తి ఫిర్యాదు ఎలా చేయాలి, కొత్త టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగిస్తున్నారు అనే విషయాలను అక్కడి పోలీస్ అధికారులు ఎస్సై సాయికిరణ్, షీ టీం గంగామణి లు విద్యార్థులకు క్లుప్తంగా వివరించడంతో విద్యార్థులు ఆనందం వ్యక్త చేశారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు ఇస్తూ వారి యొక్క బాధ్యతలను గుర్తు చేసి విద్యార్థులను ప్రోత్సహించడం జరిగింది. అనంతరం ప్రధాన వీధుల్లో ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్- భగత్ సింగ్ యొక్క విగ్రహాలను సందర్శించి వారు దేశానికి చేసిన ఎనలేని సేవలు గురించి తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ సుభాష్ , అకాడమిక్ ఇంచార్జ్ స్వప్నగంధ శర్మ, మధు షిండే ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.