రైతులకు ఎరువులు విత్తనాలు అందుబాటులో ఉంచాలి జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్

రైతులకు ఎరువులు విత్తనాలు అందుబాటులో ఉంచాలి జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్

రైతులకు ఎరువులు విత్తనాలు అందుబాటులో ఉంచాలి

జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్

నిర్మల్ మనోరంజని ప్రతినిధి ఆగస్టు 20

రైతులకు ఎరువులు విత్తనాలు అందుబాటులో ఉంచాలి

జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్

జిల్లా రైతులకు ఎరువులు, విత్తనాలు సకాలంలో అందుబాటులో ఉండేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ స్పష్టం చేశారు. బుధవారం సోన్ మండల కేంద్రంలోని డీసీఎంఎస్ రైతు సేవా కేంద్రం ఎరువులు, విత్తనాల షాపును జిల్లా ఎస్పీ జానకి షర్మిలతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఎరువుల కొరత లేదని, యూరియా, డీఏపీ వంటి ఎరువులు సరిపడా స్టాక్‌లో ఉన్నాయని తెలిపారు. రైతులు వ్యవసాయ శాఖ అధికారుల సూచనల ప్రకారం ఎరువులను వినియోగించాలని సూచించారు. ప్రతి షాపులో ఎరువుల రేటు చార్ట్ తప్పనిసరిగా ప్రదర్శించాలని నిర్వాహకులను ఆదేశించారు. ఎరువుల సరఫరాలో ఎటువంటి లోపాలు తలెత్తకుండా పర్యవేక్షణ నిరంతరం కొనసాగించాలని వ్యవసాయ, రెవెన్యూ, పోలీస్ అధికారులను ఆదేశించారు. అలాగే రైతులు ఎరువుల వినియోగంలో జాగ్రత్తలు పాటించేలా, సరైన విధానంలో వ్యవసాయం సాగించేలా అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం జిల్లా కలెక్టర్, ఎస్పీ లు సోన్ గోదావరి పుష్కర ఘాటును పరిశీలించారు. భారీ వర్షాలతో గోదావరి నది వరద ప్రవాహాన్ని అంచనా వేస్తూ గణేష్ నిమజ్జనానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. వర్షాల కారణంగా పంట నష్టం జరిగితే వెంటనే సర్వే పూర్తి చేసి నివేదికలు సమర్పించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ పరిశీలనలో ఏఎస్పీ రాజేష్ మీనా, ఆర్డీఓ రత్న కళ్యాణి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అంజి ప్రసాద్, తహసీల్దార్ మల్లేష్, అధికారులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment