కమ్మర్ పల్లి మండల జాతీయ రహదారిపై రైతులు రాస్తారోకో

కమ్మర్ పల్లి మండల జాతీయ రహదారిపై రైతులు రాస్తారోకో

కమ్మర్ పల్లి మండల జాతీయ రహదారిపై రైతులు రాస్తారోకో

మనోరంజని తెలుగు టైమ్స్ బాల్కొండ ప్రతినిధి అక్టోబర్ 19,2025.

కమ్మర్ పల్లి మండల జాతీయ రహదారిపై రైతులు రాస్తారోకో

నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం రైతులు ధర్నా కార్యక్రమం నిర్వహించారు.తమ సోయాలు మక్కల పంటలను ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి సోయాలు మక్కలు మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ రైతులు రోడ్డుపైకి వచ్చారు. రైతుల ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాలో పలు గ్రామాల రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వం సోయా, మక్కజొన్న పంటలను కొనుగోలు చేయడంలో ఆలస్యం చేయడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.తమ చెమట చుక్కలతో పండించిన పంటలు మార్కెట్‌లో తక్కువ ధరలతో వ్యాపారులు దళారులు దోపిడీ చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతులు మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలి.సన్నపు వడ్లకు బోనస్‌ను వెంటనే చెల్లించాలి.సోయా, మక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రతి గ్రామంలో ప్రారంభించి కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
రైతు సమస్యలను విస్మరిస్తే ఉద్యమాలు రాష్ట్రవ్యాప్తంగా మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ధర్నా కారణంగా కొంతసేపు రహదారిపై రాకపోకలు అంతరాయం ఏర్పడగా,పోలీసులు అక్కడికి చేరుకుని రైతులను శాంతింపజేశారు రైతులు రాస్తారోకో విరమించారు,ఈ కార్యక్రమంలో మండల కేంద్రంలోని రైతు సంఘాల నాయకులు ఆయా గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment