బికెఎస్ ఆధ్వర్యంలో బాసర నుండి రైతు పాదయాత్ర

బికెఎస్ ఆధ్వర్యంలో బాసర నుండి రైతు పాదయాత్ర

బికెఎస్ ఆధ్వర్యంలో బాసర నుండి రైతు పాదయాత్ర

బాసర మనోరంజని ప్రతినిధి అక్టోబర్ 14

బికెఎస్ ఆధ్వర్యంలో బాసర నుండి రైతు పాదయాత్ర

ప్రభుత్వం సోయా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని కోరుతూ భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో బాసర నుండి ముధోల్ వరకు పాదయాత్ర చేపట్టారు. రైతులు- కిసాన్ సంఘ్ ప్రతినిధులు దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం పాదయాత్ర ప్రారంభo సందర్భంగా బికెఎస్ ప్రతినిధులు మాట్లాడుతూ ఇటీవలే కురిసిన భారీ వర్షాలకు సుమారు 15 వేల ఎకరాలు నీటిలో మునిగిపోయి రైతులు నష్టపోయారని పేర్కొన్నారు. సోయా పంట ఇంటికి వచ్చిన ఇప్పటివరకు సోయా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదని వాపోయారు. వ్యవసాయ శాఖ అధికారులు తూతూ మంత్రంగా సర్వేలు నిర్వహించారని ఇప్పటివరకు నష్టపరిహారం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష వైఖరికి నిరసనగా రైతులు పాదయాత్ర చేపట్టడం జరిగిందన్నారు. ముధోల్లోని పశుపతినాథ్ శివాలయంలో బుధవారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించి బైంసా కు పాదయాత్రగా వెళ్లి బైంసా సబ్-కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలిపి అనంతరం సబ్-కలెక్టర్ సంకేత్ కుమార్ కు వినతిపత్రం అందిస్తామని కిసాన్ సంఘ్ ప్రతినిధులు తెలిపారు. రైతే రాజు దేశానికి వెన్నముక అనే ప్రభుత్వాలు ఎటు పోయాయాని ప్రభుత్వం స్పందించకపోతే రైతులందరిని ఏకం చేసి రాష్ట్రవ్యాప్తంగా బికెఎస్ ఆధ్వర్యంలో నిరసనలు తెలుపుతామని అన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment