ప్రముఖ సినీ కమెడియన్ నటుడు మదన్ బాబు కన్నుమూత
హైదరాబాద్ :ఆగస్టు 02*
తమిళ్ చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది ప్రముఖ కమెడియన్ మదన్ బాబు, (71 ) కన్నుమూశారు. ఆయన గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడు తున్నారు. చెన్నైలోని తన నివాసంలో తెల్లవారు జాము మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
మదన్ మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఆరు, జెమిని విక్రమ్, రన్, జోడీ, మిస్టర్ రోమియో, తెనాలి, ఫ్రెండ్స్, రెడ్ తదితర చిత్రాల్లో మదన్ నటించారు. పలు తెలుగు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు