పత్రికల తప్పుడు వార్తలు – చంద్రబాబు కుట్రలు ప్రజలకు తెలుసు: పెద్దిరెడ్డి

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి – అటవీ భూముల వివాదంపై స్పందన
  • తప్పుడు వార్తలు ప్రచురించిన పత్రికపై 50 కోట్ల పరువు నష్టం దావా
  • అటవీ భూముల ఆక్రమణ ఆరోపణలను ఖండించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
  • గతంలో టీడీపీ హయాంలో రెవెన్యూ, ఫారెస్ట్ శాఖల సంయుక్త సర్వేలో ఆక్రమణ లేదని తేల్చిన విషయం గుర్తు
  • జగన్ నాయకత్వంలో మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందని విశ్వాసం

 

మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లపై తీవ్ర విమర్శలు చేశారు. తప్పుడు వార్తలు ప్రచురించిన పత్రికపై 50 కోట్ల పరువు నష్టం దావా వేశామని తెలిపారు. అటవీ భూముల ఆక్రమణ ఆరోపణలను ఖండించారు. గతంలో టీడీపీ హయాంలోనూ జాయింట్ సర్వే నిర్వహించి ఎలాంటి ఆక్రమణలేదని తేల్చిందని గుర్తుచేశారు. జగన్ నాయకత్వంలో మళ్లీ వైసీపీ అధికారం చేపడుతుందన్నారు.

 

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఒక ప్రముఖ పత్రిక తనపై తప్పుడు ఆరోపణలు ప్రచురించిందని, ఇదే పత్రిక మదనపల్లి ఘటన సమయంలోనూ అసత్య వార్తలు రాసిందని తెలిపారు. ఈ కారణంగా ఆ పత్రికపై 50 కోట్ల పరువు నష్టం దావా వేశామని వెల్లడించారు.

అటవీ భూముల అంశంపై క్లారిటీ

ఒక పత్రిక తమపై అటవీ భూములు ఆక్రమించారని నిరాధార ఆరోపణలు చేసినట్లు పెద్దిరెడ్డి పేర్కొన్నారు. “2001లో మేము భూములు కొనుగోలు చేసాం. 23 ఎకరాల భూమి 75 ఎకరాలుగా ఎలా మారుతుందో?” అని ప్రశ్నించారు. 1981లోనే సెటిల్మెంట్ డైరెక్టర్ తమకు ఆ భూమిని ఇచ్చారని స్పష్టంచేశారు.

2001లోనే అక్కడ పని చేసే వారికోసం గెస్ట్ హౌస్ నిర్మించామని, దాన్ని ఇటీవల అధునాతన గెస్ట్ హౌస్‌గా మార్చారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. “కిరణ్ కుమార్ రెడ్డి సీఎం అయినప్పుడు టీడీపీ నేత ఫిర్యాదు చేశాడు. రెవెన్యూ, ఫారెస్ట్ శాఖలు సంయుక్త సర్వే నిర్వహించి ఎలాంటి అక్రమ ఆక్రమణలు లేవని తేల్చాయి” అని వివరించారు. చంద్రబాబు మళ్లీ సీఎం అయిన తర్వాత కూడా ఇదే ఫిర్యాదు విచారణకు వెళ్లిందని, కానీ ఎలాంటి అక్రమాలు లేవని తేల్చారని తెలిపారు.

చంద్రబాబు, పవన్‌పై విమర్శలు

పెద్దిరెడ్డి మాట్లాడుతూ, “చంద్రబాబు తానా అంటే పవన్ కళ్యాణ్ తందాన అంటారు” అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. గతంలో తనపై ఇసుక అక్రమాల ద్వారా 40 వేల కోట్లు సంపాదించానని, నేపాల్‌లో తనకు సంబంధించిన ఎర్రచందనం పట్టుబడిందని చేసిన ఆరోపణలు ఇప్పుడు ఏమయ్యాయని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యాక ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారని నిలదీశారు.

“చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలు ఇస్తూ, ఇప్పుడు వాటిని అమలు చేయలేమని తేల్చేశారు. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు” అని విమర్శించారు.

జగన్ నాయకత్వంపై విశ్వాసం

పెద్దిరెడ్డి మాట్లాడుతూ, “వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్ ఎంపీగా, విజయమ్మ ఎమ్మెల్యేగా ఉండగా స్థాపించబడింది. ఎవరు పార్టీలో ఉన్నా లేకున్నా, వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తుంది” అని ధీమా వ్యక్తం చేశారు. జగన్ క్యాలెండర్ ప్రకారం పథకాలు అమలు చేస్తూనే ఉన్నారని, కరోనా సమయంలో ప్రపంచం కుదేలైనా, ప్రభుత్వ పథకాలు ఎక్కడా ఆగలేదని అన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment