రుద్రూరు ఎస్ఐ సాయన్న సార్‌పై ప్రజల గౌరవం, విశ్వాసం – ఉత్తమ పోలీస్ అవార్డు పొందిన ప్రజల పోలీస్
రుద్రూర్, నిజామాబాద్ జిల్లా:
ప్రజలతో మమేకంగా, చిరునవ్వుతో ఉండే వ్యక్తి. సున్నితంగా మాట్లాడే తీరుతో, ప్రేమపూర్వకంగా కౌన్సిలింగ్ ఇచ్చి మార్పు కోసం పాటుపడే పోలీస్ అధికారి. అదే సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే, చట్టాన్ని ఉల్లంఘిస్తే ఒక్క శాతం పోలీస్ పవర్ చూపించి “చట్టం అంటే ఇదే!” అని చెప్పగల శక్తివంతమైన అధికారి.
ఇలాంటి రెండు పాత్రలను సమంగా సమర్థంగా నిర్వర్తిస్తున్న వ్యక్తే రుద్రూరు ఎస్ఐ సాయన్న.
“పోలీస్ అంటే భయం” అనే భావనను మరిచిపోయేలా, “పోలీస్ అంటే మిత్రుడు” అనే భావనను ప్రజల్లో నాటిన ఆఫీసర్ అని గ్రామస్థులు గర్వంగా చెబుతున్నారు. 100 శాతం వ్యవహారంలో, 99 శాతం ప్రేమ, మాటలతో మార్పు కోసం ప్రయత్నం చేస్తారు. వినని పక్షంలో మాత్రం, చట్టబద్ధంగా 1 శాతం పవర్ చూపించి మార్పు తీసుకొస్తారు.
ఫ్రెండ్లీ పోలీస్‌కు జీవంతో నిర్వచనం
-
ఎవరైనా కష్టాల్లో ఉన్నా, ఆపదలో ఉన్నా, వారిని అక్కున చేర్చుకుని పరిష్కారం చూపే ప్రయత్నం
-
చిన్నపిల్లలు, పెద్దవాళ్లు, పేదలు, మధ్యతరగతి – ఎవ్వరినీ భేదించకుండా అందరితో మమేకం
-
గ్రామంలో కలిసిపోయేలా ఉండటం, ప్రజల మాట వినటం – ఇది ఆయన ప్రథమ ధ్యేయం
-
చట్టాన్ని కాపాడటంలో మాత్రం ఎవ్వరి మాట విన్నా తేడా లేదు – నేరాన్ని తట్టుకోరు, నేరస్తుడ్ని వదలరు
“విశ్వరూపం” చూపించాల్సిన పరిస్థితి వస్తే…
నిరంతరం కౌన్సిలింగ్, మాటలతో మార్పు కోసం ప్రయత్నించే సాయన్న సారు, అవసరం వచ్చినపుడే తమ పోలీస్ పవర్ చూపుతారు. అప్పుడు ఆయన చూపే విధానం, తీరు చూస్తే చట్టాన్ని ఉల్లంఘించే వాళ్లకు మార్పు తప్పదు అని ప్రజలు చెబుతున్నారు.
అవార్డు కాదు – ప్రజల గుండెల్లో గెలుపు
సమర్థంగా ప్రజలతో కలిసి పని చేయడం, ఒత్తిడులకు లోనవకుండా న్యాయంగా వ్యవహరించడం, రాజకీయ ప్రభావాల మధ్య చట్టాన్ని కాపాడటం – ఈ సమష్టి కారణాల వల్లే సాయన్న సారు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఉత్తమ ఎస్సై అవార్డు అందుకున్నారు.
ప్రజల మాటలో సాయన్న:
“ఈ సారు ఎస్‌ఐలా ఉంటారా అనిపిస్తుంది. కానీ ఆయన ఆపదలో ఉన్నా తోడు, తప్పు చేసినా గట్టి హెచ్చరిక. అందుకే ప్రజల మనసులో చోటు సంపాదించారు.”
“ప్రజల పక్షాన ఉండే అధికారి అంటే ఇదే. వత్తిడులకు లొంగకుండా కర్తవ్యాన్ని నిర్వర్తించే పోలీస్.”