ధ్వంసమైన లిఫ్ట్ ఇరిగేషన్ ట్రాన్స్ఫార్మర్ల పరిశీలన

ధ్వంసమైన లిఫ్ట్ ఇరిగేషన్ ట్రాన్స్ఫార్మర్ల పరిశీలన

అధికారులు స్పందించి పనులను పూర్తి చేయాలి

ముధోల్ మనోరంజని ప్రతినిధి జూలై 17

ధ్వంసమైన లిఫ్ట్ ఇరిగేషన్ ట్రాన్స్ఫార్మర్ల పరిశీలన

ముధోల్ మండలం అష్ట గ్రామంలోని శ్రీ సరస్వతి లిఫ్ట్ ఇరిగేషన్ వద్ద గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేసిన ట్రాన్స్ఫార్మర్లను కాంగ్రెస్ పార్టీ నాయకులు రావుల శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ వీడీసీ చైర్మన్ సురుగుల పోశట్టి సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. గుర్తుతెలియని దుండగులు కరెంట్ తీగలను కట్ చేసి దాంట్లో ఉన్న ఆయిల్ ను తీసివేసి విలువైన కాపర్ ను దొంగలించడం వల్ల రూ. 15 లక్షల వరకు ప్రభుత్వానికి నష్టం జరిగిందని తెలిపారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఐదు కోట్ల రూపాయలతో ఎత్తిపోతల పథకం కింద ప్రారంభించడం జరిగిందన్నారు. అప్పట్లో పని చేసిన ఏజెన్సీ రెండు మూడు రోజుల ట్రైలర్ లీకేజీలు మరమ్మతులు ఉన్న ఏజెన్సీ దగ్గర నుండి ఇరిగేషన్ శాఖ హ్యాండోవర్ తీసుకున్నదని తెలిపారు. పనులు అలానే ఉండడంతో గ్రామస్తులు అందరూ కలిసి గత ప్రభుత్వానికి విన్నవించగా మూడు కోట్ల రూపాయలను మంజూరు చేయడం జరిగిందన్నారు. కాంట్రాక్టర్ సుమారుగా ఐదు సంవత్సరాల నుంచి పనులు చేస్తూనే ఉన్నారన్నారు. కానీ ఇప్పటివరకు కూడా మరమ్మత్తులు పనులు పూర్తి కాలేదు అన్నారు. అధికారులు గ్రామస్తులు- కమిటీ చైర్మన్ లను కలిసి మాట్లాడిన పాపాన పోలేదని అన్నారు. ట్రాన్స్ఫార్మర్ పగలగొట్టి కాపర్ వైర్ ను దొంగలించబడిన విషయం తెలుసుకున్న సంబంధిత శాఖ అధికారులు వచ్చి వెళ్లారని పేర్కొన్నారు. స్థానిక పోలీస్ స్టేషన్లో అధికారులతో మాట్లాడి ఫిర్యాదు చేస్తే బాగుంటదని గ్రామస్తులు, కమిటీ సభ్యులు అన్నారు. అధికారులు స్పందించి పనులను పూర్తిచేస్తే రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని వెల్లడించారు. ప్రభుత్వపరంగా అన్ని సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానికులు బొంగు సాయిలు, కనకాపురం అనిల్, గంగాధర్, అంజి, శ్రీకాంత్, కనకాపురం లింగం, వీడిసి సభ్యులు లక్ష్మారెడ్డి, మోహన్, రైతులు, తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment