దుర్గామాత దీవెనలతో అంతా మంచి జరగాలి : జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

దుర్గామాత దీవెనలతో అంతా మంచి జరగాలి : జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

దుర్గామాత దీవెనలతో అంతా మంచి జరగాలి : జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

మనోరంజని రంగారెడ్డి జిల్లా ప్రతినిథి సెప్టెంబర్ 25 : దుర్గామాత దీవెనలతో ప్రజలందరికీ మంచి జరగాలని జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి అన్నారు.గురువారం షాబాద్ మండల కేంద్రంలోని దుర్గామాత మండపంలో ఏర్పాటు చేసిన అమ్మవారికి కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అన్నప్రసాదన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవి నవరాత్రి ఉత్సవాలు భక్తులకు ఆధ్యాత్మిక శక్తిని, సమాజానికి శుభసూచక మార్గదర్శకత్వాన్ని అందిస్తాయన్నారు.చారిత్రక ఆలయాలు, దేవాలయాలు మన సంస్కృతి వైభవానికి ప్రతీకలని తెలిపారు. దేవి
కటాక్షంతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని,తెలంగాణ అభివృద్ధి పథంలో మరింత ముందుకు సాగాలని అమ్మవారిని కోరుకున్నట్లు పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఎలుగంటి కవిత మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ అమ్మవారిపై మనస్సు ఉంచి పూజలు చేస్తేనే అమ్మవారి కరుణ లభిస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కావలి చంద్రశేఖర్, ఎంపీటీసీ సభ్యులు కుమ్మరి చెన్నయ్య, మాజీ సర్పంచులు ప్రతాపరెడ్డి, జనార్దన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సర్దార్ నగర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సంజీవరెడ్డి,కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాహుల్ గుప్తా,శ్రీనివాస్ రెడ్డి ,ప్రభాకర్ రెడ్డి, గౌరీశ్వర్ అంజిరెడ్డి ,ప్రశాంత్, రాఘవేందర్, సాయి, ప్రభాకర్ రెడ్డి ,సూర్య భాయ్, రాజేందర్ రెడ్డి, రమేష్, కిషోర్, రాఘవేంద్ర స్వామి, సందీప్ గౌడ్, శ్రీనివాస్, కృష్ణారెడ్డి,అమ్మవారి భక్తులు గ్రామస్థులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment